టోక్యో : కొందరు మనుషులకు విచిత్రమైన కోరికలుంటాయి. అందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. అయితే తాజాగా ఓ వ్యక్తి తన విచిత్ర కోరికను లక్షలు పెట్టి మరీ తీర్చుకున్నాడు. ఆ కోరిక ఏంటంటే.. శునకంలా మారడం. ఇది నిజం.. అది అతని కోరిక కావడంతో ఏకంగా రూ. 12 లక్షలు ఖర్చు చేసి మరీ శునకంలా మారిపోయాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జెప్పెట్ అనే సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం శిల్పాలను తయారుచేస్తూ ఉంటుంది. మస్కట్ పాత్రల దుస్తులను కూడా డిజైన్ చేస్తుంటుంది. అయితే జపాన్ కు చెందిన టోకో ఇవీ అనే వ్యక్తి ఆ సంస్థను సంప్రదించాడు. తాను శునకంలా కనిపించాలనుకుం టున్నానని చెప్పాడు. ఇందుకు ఎంత ఖర్చయినా పర్వాలేదని చెప్పాడు. అందుకు అంగీకరించిన జెప్పెట్ సంస్థ.. 40 రోజులపాటు కష్టపడి అతడిని కోలీ జాతి శునకంలా మార్చేసింది. మేకప్, ఇతర ఖర్చుల నిమిత్తం టోకో 2 మిలియన్ యెన్‌లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 12 లక్షలు) ఖర్చుచేశాడు టోకో ఇవీ. అయితే, ఈ శునకం అవతారంలో ఎన్ని రోజులు అతను ఉంటాడో తెలియదు. తాను శునకంలా మారి అందుక సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 09:43AM