హైదరాబాద్ : టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి(76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలో బుధవారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
వైంకుఠపాలి, అల్లుడుగారు జిందాబాద్, మూడిళ్ల ముచ్చట, మాయగాడు, అభిమానవంతులు, సీతాపతి సంసారం, గడుసు పిల్లోడు, మా ఊరి దేవత, అగ్ని కెరాటాలు వంటి చిత్రాలకు రామకృష్ణారెడ్డి నిర్మాతగా ఉన్నారు. శ్రీ రామకృష్ణా ఫిల్మ్స్ బ్యానర్పై ఆయన వీటిని నిర్మించారు. అమ్మోరు తల్లి చిత్రాన్ని తెలుగులో డబ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 10:06AM