శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో కార్గిల్ నుంచి శ్రీనగర్ వెళ్తోన్న ట్యాక్సి ప్రమాదవశాత్తు జోజిలా పాస్ వద్ద లోతైన లోయలో పడిపోయింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జోజిలా పాస్ సుమారు 3,400 మీటర్లు ఎత్తులో ఉంటుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm