హిందూ ఏక్తా యాత్రలో మత సామరస్యం#HinduEkthaYatra #HindustanKaSher #Karimnagar #BandiSanjay #Hindus pic.twitter.com/vO95zuq68O
— MERUGU RAJU (@MR4BJP) May 25, 2022
హైదరాబాద్ : దేశంలో ఒకవైపు కొందరు రాజకీయ నాయకులు మతకలహాలు, మతవిద్వేషాల సృష్టిస్తుంటే మరోవైపు కొందరు ముస్లింలు మతసామరస్యాన్ని చాటుకున్నారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో రాముడి విగ్రహంపై ముస్లిం సోదరులు పూల వర్షం కురిపించారు. బీజేపీ రాష్ర్ట అద్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బుధవారం ఏక్తా యాత్ర పేరుతో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో రాముడు, హనుమాన్ విగ్రహాలను ప్రధాన రహదారుల గుండా ఊరేగించారు. అయితే ఈ యాత్ర రాజీవ్ చౌక్ వద్దకు చేరుకోగానే.. ముస్లింలు బిల్డింగ్ పైనుంచి రాముడి విగ్రహంపై పూల వర్షం కురిపించారు. ఈ దృశ్యం అక్కడున్నవారందరినీ ఆకట్టుకుంది. అయితే ఇదే యాత్రలో బండి సంజయ్.. మసీదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఒకవైపు మతసామరస్యం చాటుతుంటే బండి సంజయ్ మత విద్వేష వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.