హైదరాబాద్ : వినియోగదారుడి నుంచి క్యారీ బ్యాగ్ కోసం అదనంగా మూడు రూపాయలు వసూలు చేసిన స్పెన్సర్స్ రిటైల్ లిమిటెడ్‌కు హైదరాబాద్ రెండవ వినియోగదారుల కమిషన్ షాకిచ్చింది. కొనుగోలు తేదీ నుంచి పిటిషనర్‌కు తిరిగి చెల్లించే వరకు 9శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని స్పెన్సర్స్ రిటైల్ లిమిటెడ్‌ను కమిషన్ ఆదేశించింది. ఫిర్యాదు దారుడికి రూ.10వేల నష్టపరిహారం, ఖర్చుల నిమిత్తం రూ.6వేలు చెల్లించాలని కమిషన్ అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు తీర్పు చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే... 2019 జూన్ 2వ తేదీన ఫిర్యాదుదారుడు వడ్డె ఆనంద్‌రావు వస్తువుల కొనుగోలుకు అమీర్‌పేట స్పెన్సర్స్ సూపర్‌మార్కెట్‌కు వెళ్లారు. రూ.101 బిల్లు కాగా అదనంగా మార్కెట్ వారు కవర్ కోసం రూ.3 వసూలు చేసి లోగో ఉన్న కవర్ అందించారు. అయితే ఫిర్యాదుదారుడు అభ్యంతరం తెలిపినా ఉపయోగం లేకపోవడంతో ఆయన వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. తరువాత ఆ మాల్‌ను మూసేసినా అతని విడిచిపెట్టలేదు. కమిషన్ ఆదేశాలతో పత్రికలో ప్రకటన ఇచ్చి, రెండో ప్రతివాదిగా రెండో ప్రతివాది స్పెన్సర్ రిటైల్ లిమిటెడ్, ముషీరాబాద్‌ను ఇంప్లీడ్ చేసి వినియోగదారుల కమిషన్‌లో విజయం సాధించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 11:10AM