హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి. పుల్లారెడ్డి కుమారుడు, మనవడికి గృహ హింస కేసులో హైదరాబాద్ మొబైల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్ రెడ్డిపై ఆయన భార్య ప్రజ్ఞారెడ్డి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో గృహ హింస చట్టం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రజ్ఞారెడ్డి బుధవారం హైదరాబాద్ మొబైల్ కోర్టును ఆశ్రయించారు. తనను ఇంట్లోనే నిర్బంధించి వేధింపులకు గురిచేశారని ఆమె.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తనను ఎలా హింసిస్తున్నారో తెలిపే ఫొటో కాపీలను ఆమె కోర్టులో సమర్పించారు. దాంతో, ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ప్రజ్ఞారెడ్డికి భద్రత కల్పించాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. అనంతరం, పుల్లారెడ్డి కొడుకు రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య, కుమారుడు ఏక్‌నాథ్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm