హైదరాబాద్ : ఎఫ్3లో వెంకటేశ్ చేసే హడావిడి చూసి తీరాల్సిందే అని అంటున్నారు దర్వకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ఎఫ్ 3. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో నిర్మాత శిరీష్ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అనిల్ రావిపూడి మీడియాతో పంచకున్నారు.
ఆయన మాట్లాడుతూ.. 'ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవడానికి ఒక లైబ్రరీ లాంటి సిరీస్ ఉండాలని ఎఫ్ 2 ఫ్రాంచైజ్‌ని చేశాం. ఎఫ్ 2 బిగ్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. అందులో భార్యాభర్తల ప్రస్టేషన్ ఉంటే,
ఎఫ్ 3లో మనీ ఫస్ట్రేషన్ ఉంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే కథ. ఎఫ్2కి మించిన వినోదాన్ని చూస్తారు.
ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా.ఈ సినిమాకి ఖచ్చితంగా రిపీట్ ఆడియెన్స్ వస్తారు. ఫన్ డోస్ పెంచడానికి ఈ సినిమాలో వెంకటేష్‌గారికి రేచీకటి, వరుణ్‌తేజ్‌కి నత్తి వంటి ఎలిమెంట్స్‌ని యాడ్ చేశాం. చీకటిపడగానే తెరపై వెంకటేశ్ చేసే హడావిడి చూసితీరవలసిందే. ఇక వరుణ్ తన మేనరిజం సినిమా మొత్తంలో 30 చోట్ల వాడవలసి వచ్చింది. ఇందులో డబ్బు గురించి చెప్పే ఫైనల్ కంటెంట్ కూడా అందరికీ నచ్చుతుంది. అయితే ఇదేదో మెసేజ్‌లా ఉండదు, నిజంలా ఉంటుంది. డబ్బుతో మనం ఎలా ఉండాలనేది చెప్తాం. ఎఫ్ 3లో మూడో హీరోను పెడదామని అనుకున్నాను. కానీ ఇందులో కావలసినంత ఫన్ వచ్చేసింది. ఎఫ్ 4లో మాత్రం కచ్చితంగా మూడో హీరోను రంగంలోకి దింపుతాం.
బాలయ్య సినిమా కోసం సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్తాం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. బాలయ్య ఎంత పవర్ ఫుల్‌గా ఉంటారో ఆ పవర్‌కి తగ్గట్టే సినిమా ఉంటుంది. మేము ఇద్దరం కొత్త మార్క్ సినిమాతో రాబోతున్నాం` అని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 11:26AM