కలబురగి : దేశంలో వరుసగా పరువు హత్యలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా భిన్న మతానికి చెందిన మహిళను ప్రేమిస్తున్న 25 ఏండ్ల యువకుడు హత్యకు గురైన ఘటనతో కర్ణాటకలోని కలబురగి జిల్లాలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని వాడిటౌన్‌లోని భీమా నగర్ లేఅవుట్‌కు చెందిన విజయ కాంబ్లే మరో మతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమెను పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే వీరి బంధాన్ని యువతి కుటుంబీకులు వ్యతిరేకించారు. కాంబ్లేను హత్య చేయాలని వారు పథకం పన్నారు.
ఈ క్రమంలో యువతి కుటుంబీకులు బుధవారం రాత్రి కాంబ్లేను ఓ రైల్వే బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి రాళ్లు, ఇటుకలతో దారుణంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో కాంబ్లే అక్కడికక్కడే మృతి చెందాడు. అ ఈ ఘటనతో వాడి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని సున్నిత, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 12:01PM