హైదరాబాద్ : కన్వేయర్ బెల్ట్‌లో పడి యువతి మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే ఛత్తీస్ ఘడ్‌కి చెందిన దస్మి (22) అనే యువతి అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలోని కన్వేయర్ బెల్ట్‌లో ప్రమాదవశాత్తు పడింది. దాంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను సత్తుపల్లి ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆమెను ఖమ్మం తరలించారు. అయితే ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm