అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయభేరి పేరిట నాలుగురోజుల పాటు కొనసాగనున్న మంత్రుల బస్సుయాత్ర శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది . ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన 17 మంది మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు ధర్మనా ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పీసల అప్పరాజు మాట్లాడుతూ .. రాష్ట్రంలో 82 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అందజేస్తున్నామని తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సామాజిక విప్లవం దేశమంతా అవలంభించాలని అన్నారు. సమసమాజ స్థాపనకు వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. మొదటిసారిగా 74 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మంత్రులయ్యారని.. ఇది చరిత్రలో సీఎం వైఎస్ జగన్ ఒక్కరే చేయగలిగారన్నారు. ప్రభుత్వ పథకాల్లో 82 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారన్నారు. ప్రజలకి వాస్తవాలు వివరించేందుకు బస్సు యాత్ర చేస్తున్నామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm