హైదరాబాద్: వరుస హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఆయన దర్శకత్వం వహించిన ఎఫ్ 3 సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఆయన చిత్రం ప్రమోషన్ల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఓ ప్రమోషన్ కార్యక్రమంలో అనిల్ మాట్లాడుతూ.. కాలేజీలో తమది పెద్ద బ్యాచ్ అని తెలపారు. కాలేజీ అయిపోగానే తమ బ్యాచ్ మొత్తం మరో నలుగురు అమ్మాయిల బ్యాచ్ ను ఫాలో అయ్యేవాళ్లమని చెప్పారు. ఆ నలుగురు అమ్మాయిల్లో తనకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టమని అందుకే ఆ అమ్మాయికి సైట్ కొట్టే వాడినని అన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు ఆ బ్యాచ్ లో ఉన్న అమ్మాయితో పెండ్లయిందని.. అయితే ఆ అమ్మాయి తాను సైట్ కొట్టిన అమ్మాయి కాదని తెలిపారు. అంటే తన భార్య ఫ్రెండ్ కు సైట్ కొడితే... తన భార్య పడిందని చెప్పారు. తన ఫ్రెండ్ కు సైట్ కొట్టావంటూ ఇప్పటికీ తన భార్య తనను ఇప్పటికీ అంటుందన్నారు. ప్రతీ రోజు తనకు, తన భార్యకు మధ్య ఏదో ఒక విషయమై చిన్న గొడవైనా జరుగుతుంటుందని చెప్పారు.ఎఫ్ 2 సినిమాలో కొన్ని సన్నివేశాలు కూడా తన రియల్ లైఫ్ లోనివే అని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 03:00PM