అమరావతి : తనకు కోపం వస్తే ఎవరిని వదిలేది లేదని.. తోకలు కత్తిరించి పంపుతానని టీడీపీ అధినతే చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం ఆయన చిలకలూరిపేట వద్ద మాట్లాడారు. మహానాడును అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒంగోలులో తమ సభకు మైదానం ఇవ్వరా? తమ ఫ్లెక్సీలు చించేస్తారా? అని అన్నారు. మహానాడును మేమేమీ అడ్డుకోవడం లేదని ఓ మంత్రి అంటున్నాడని... మహానాడును ఆపగలమని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. టీడీపీ మహానాడు ఓ ప్రభంజనం అని.. తనకు కోపం వస్తే ఎవరిని వదిలేది లేదన్నారు. పిచ్చివేషాలు వేయకుండా మీరు మర్యాదగా ఉంటే సరి... లేకపోతే తోకలు కత్తిరించి పంపుతాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఒంగోలులో నిర్వహించే మహానాడుకు టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ కట్టలు తెంచుకుని రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తికరంగా లేదని, క్విట్ జగన్-సేవ్ ఆంధ్రప్రదేశ్ కు మహానాడు ద్వారా పిలుపునిద్దామని అన్నారు. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని, 1994లోనూ ఇంత ఉత్సాహం లేదని అన్నారు.
టీడీపీ శ్రేణులను కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని, ఎంతోమంది సీఎంలను చూశానని, కానీ ఇటువంటి పనికిమాలిన చిల్లర సీఎంను మాత్రం చూడలేదని చెప్పారు. వైసీపీ అరాచకాలకు చక్రవడ్డీతో కలిపి చెల్లించడం ఖాయమని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 26 May,2022 04:26PM