హైదరాబాద్ : హైదరాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన భర్తతో ఓ యువతి చనువుగా ఉంటోందని అనుమానించి ఆమెపై సామూహిక లైంగికదాడి జరిపించింది. అంతేకాకుండా ఆ ఘాతుకాన్ని వీడియో తీసింది.
వివరాల్లోకెళ్తే.. నగరంలోని కొండాపూర్ శ్రీరామ్ నగర్ లో శ్రీకాంత్, గాయత్రి దంపతులు నివసిస్తున్నారు. శ్రీకాంత్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన 25 ఏండ్ల యువతి కూడా అదే కాలనీలో నివాసముంటూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో యువతికి, శ్రీకాంత్ కి పరిచయం ఏర్పడింది. అయితే తన భర్తతో ఆ యువతి చనువుగా ఉండడం చూసి గాయత్రి తట్టుకోలేకపోయింది. ఆమెపై ఏప్రిల్ 24న పోలీసులకు కూడా గాయత్రి ఫిర్యాదు చేసింది. అయితే ఏమైందో ఏమో గానీ ఈ నెల 26న ఆ కేసును ఉపసంహరించుకుంది.
అయితే ఈ విషయం పై మాట్లాడేందుకు యువతిని గాయత్రి ఇంటికి పిలిచింది. ఈ మేరకు యువతి ఆమె ఇంటికి వెళ్లింది. గాయత్రి పథకం ప్రకారం.. అప్పటికే ఇంట్లో ఉన్న నలుగురు యువకులు.. యువతి నోట్లో గుడ్డలు కుక్కి హింసించారు. యువతి ప్రయివేటు భాగాల్లో పదునైనా ఆయుధాలతో గాయపరిచారు. అనంతరం ఆమెపై లైంగికదాడి చేశారు. ఈ దారుణాన్ని మొత్తాన్ని గాయత్రి తన సెల్ఫోన్లో బంధించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ వీడియో మొత్తాన్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. అనంతరం యువతిని కుటుంబసభ్యులు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత యువతి జరిగిందంతా పోలీసులకు చెప్పింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాయత్రితో పాటు నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 May,2022 05:47PM