హైదరాబాద్ : ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూస్ వాలా దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్ లోని మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో అతన్ని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అతనితో సహా 424 మంది వీఐపీలకు భద్రతను పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకున్న ఒక రోజు తర్వాత ఇది జరిగింది.
సిద్ధూ మూస్ వాలా ఈ ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాన్సా నుంచి కాంగ్రెస్ టిక్కెట్ సాధించి పోటీ చేసి ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లా చేతిలో 63,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. అయితే అవినీతి ఆరోపణలపై విజయ్ సింగ్లాను ఇటీవల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తొలగించారు.
గత నెలలో సిద్ధూ మూస్ వాలా తన 'బలిపశువు..`పాటలో ఆమ్ ఆద్మీ పార్టీని, దాని మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని దుమారం రేపారు. గాయకుడు తన పాటలో ఆమ్ ఆద్మీ మద్దతుదారులను గద్దర్ (ద్రోహి) అని పిలిచాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 May,2022 07:05PM