హైదరాబాద్: ఇప్పటికే రెండుసార్లు ఛార్జీలు పెంచి తెలంగాణ ఆర్టీసీ మరోసారి చార్జీల మోత మోగించనుంది. రాష్ర్టంలో ఆర్టీసీ బస్సుల్లో అదనపు డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు. పల్లెవెలుగులో 250 కిలోమీటర్ల దూరానికి రూ.5 నుంచి రూ.45కి పెంచారు. ఎక్స్‌ప్రెస్‌లో 500 కి.మీ. దూరానికి రూ.5 నుంచి రూ.90కి పెంచుతూ నిర్ణయించారు. డీలక్స్ బస్సుల్లో 500 కిలో మీటర్ల దూరానికి రూ.5 నుంచి రూ.125కి పెంచారు. సూపర్ లగ్జరీలో 500 కిలోమీటర్ల దూరానికి రూ.10 నుంచి రూ.130కి పెంచారు. ఏసీలో 500 కిలోమీటర్ల దూరానికి రూ.10 నుంచి రూ.170కి పెంచారు. హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ లేదని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు చార్జీల పెంపు నుంచి జీహెచ్‌ఎంసీని మినహాయించారు.
Mon Jan 19, 2015 06:51 pm