హైదరాబాద్: కొన్ని సార్లు బ్యాంక్ లలో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటుంటాయి. మనం అప్పుడప్పుడు కొందరి ఖాతాలో కోట్ల డబ్బులు డిపాజిట్ అవ్వడం వంటి మెసెజ్ లు వస్తుంటాయి. కొన్ని సార్లు ఏటీయం లో అధికారులు డబ్బులు జమా చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీంతో అనుకొని సంఘటనలు జరుగుతుంటాయి. ఈ కోవకు చెందన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. పూర్తి వివరాలు.. మహారాష్ట్రలోని నాగపూర్ లో వింత ఘటన జరిగింది. బుధవారం రోజున.. నాగపూర్ కు నగరానికి 30 కిలో మీటర్లు దూరంలో ఖపర్ ఖేడా అే పట్టణం ఉంది. అక్కడ ఒక ప్రైవేటు బ్యాంకుకు చెందన ఏటీఎం ఉంది. అక్కడ ఒక వ్యక్తి ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేయడానికి వెళ్లాడు. 100 రూపాయలున విత్ డ్రా చేస్తే... 500 రూపాయల డినామినేషన్ కరెన్సీ నోట్లు వచ్చాయి. దీంతో అతను షాక్... అయ్యి.. ఈ సారి 500 రూపాయలను విత్ డ్రా చేశాడు. అప్పుడు 2,500 డినామినేషన్లు వచ్చాయి. దీంతో ఈ వార్త అక్కడ ఉన్న వారికి తెలిసి పోయింది. జనాలు విత్ డ్రా కోసం అక్కడ ఎగబడ్డారు. ఏటీఎం ముందు జనాలు క్యూలో గుంపులు గుంపులుగా గుమిగూడారు. అందరు ఏటీఎం నుంచి ఇష్టారీతిన డబ్బులను విత్ డ్రా చేశారు. దీంతో ఈ ఘటన.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఈ క్రమంలో అధికారులు.. అక్కడికి చేరుకున్నారు. ఏటీఎంను సీజ్ చేశారు. బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. బ్యాంకు అధికారులు పొరపాటున డినామినేషన్ కరెన్సీ నోట్లను ఏటీఎం ట్రేలో తప్పుగా పెట్టినట్లు గుర్తించారు. అందుకే సాంకేతిక లోపం కారణంగా.. ఏటీఎం తప్పుగా అదనంగా నగదు సరఫరా చేస్తున్నట్లు కనుగొన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm