చండీఘడ్: ఒక ముస్లిం అమ్మాయికి 16 సంవత్సరాల వయస్సు వస్తే ఆమె ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చని పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 16, 21 సంవత్సరాల వయస్సు గల ముస్లిం జంటకు వారి కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది
పఠాన్‌కోట్‌కు చెందిన 16 ఏండ్ల బాలిక, 21 ఏండ్ల యువకుడు జూన్ 8వతేదీన ఇస్లామిక్ పద్ధతుల ప్రకారం వివాహం చేసుకున్నారు. అయితే వారి కుటుంబాలు ఆ పెండ్లిని వ్యతిరేకించాయి. వారిని బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ నూతన వధూవరులు తమ రక్షణ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పంజాబ్, హరియాణా హైకోర్టులోని జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ మేరకు ధర్మాసానం ఇస్లామిక్ చట్టాన్ని ఉదహరించింది. షరియా చట్టం ప్రకారం పురుషులు, మహిళలు 15 సంవత్సరాల వయస్సులో పెద్దలుగా పరిగణిస్తారు.
'సర్ దిన్షా ఫర్దుంజీ ముల్లా రచించిన ప్రిన్సిపల్స్ ఆఫ్ మహ్మదీన్ లాఃపుస్తకంలోని ఆర్టికల్ 195 ప్రకారం, పిటిషనర్ నం. 2 (అమ్మాయి) 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నందున తనకు నచ్చిన వ్యక్తితో వివాహ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అర్హులు. పిటిషనర్ నం.1 (అబ్బాయి) వయస్సు 21 సంవత్సరాలు కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. కాబట్టి, పిటిషనర్లు ఇద్దరూ ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం వివాహ వయస్సు కలిగి ఉన్నారు` కోర్టు పేర్కొంది. ఈ మేరకు నూతన దంపతులకు సరైన భద్రత కల్పించాలని పఠాన్‌కోట్ ఎస్‌ఎస్పీని హైకోర్టు జస్టిస్ బేడీ ఆదేశించారు. నూతన జంట ప్రాథమిక హక్కులను తిరస్కరించలేమని హైకోర్టు జస్టిస్ తన తీర్పులో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 20 Jun,2022 11:52AM