కరాచీ : పాకిస్థాన్‌లోని సింధు ప్రావిన్సులో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ హెల్త్ సెంటర్‌లో ఓ మహిళ గర్భంలో ఉన్న శిశువు తలను కోసేసి ఆ భాగాన్ని కడుపులోనే వదిలేశారు. ప్రస్తుతం ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పై సింధు ప్రభుత్వం వైద్య విచారణకు ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. భీల్ వర్గానికి చెందిన 32 ఏండ్ల మహిళ ప్రసవం కోసం థార్‌పార్కర్ జిల్లాలో ఉన్న ఓ గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అయితే అక్కడ మహిళా గైనకాలజీ వైద్యులు లేరు. అనుభవం లేని సిబ్బంది శిశువును గర్భం నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే శిశువును గర్భం నుంచి తీసే సమయంలో సరిగ్గా ఆపరేషన్ చేయలేకపోయారు. ఆ శిశువు తలను కోసేసి ఆ మహిళ గర్భంలోనే వదిలేశారు. మహిళ పరిస్థితి విషమించడంతో ఆమెను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లారు. లియాకత్ వర్సిటీ హాస్పిటల్‌లో ఆపరేషన్ చేసి ఆ మహిళ గర్భంలో ఉన్న మిగితా శరీరాన్ని బయటకు తీశారు.
లియాకత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాహీల్ సికిందర్ మాట్లాడుతూ.. శిశువు తల మహిళ గర్భంలో ఇరుక్కుపోయిందని, ఆ మహిళ మూత్రాశయం కూడా దెబ్బతిన్నదని.. ఆమెను కాపాడేందుకు కడుపుకు సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. శిశువు తలను కడుపు సర్జరీ ద్వారా బయటకు తీసినట్లు చెప్పారు. ఈ ఘటన పట్ల సింధు ఆరోగ్యశాఖ డీజీ డాక్టర్ జుమాన్ భాటో విచారణకు ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 21 Jun,2022 11:20AM