ముంబై: మహారాష్ర్టలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సంచలన ఆరోపణలు చేశారు. సీఎంను కలిసేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలకే అవకాశం దక్కలేదని ఆరోపించారు. సీఎం చుట్టూ ఉండే మనుషులే తాము సీఎంను కలవాలో వద్దో నిర్ణయించేవాళ్లు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖను ఏక్‌నాథ్ షిండే మీడియాతో షేర్ చేశారు.
సీఎం ఉద్ధవ్ ఠాక్రే వ్యహరించిన తీరు అవమానకరంగా ఉందని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
సీఎం ఎన్నడూ సెక్రటేరియేట్ రాలేదని, ఆయన ఎప్పుడూ సొంత నివాసం మాత్రుశ్రీలోనే ఉండేవారని చెప్పారు. సీఎం ఇంట్లో ఉండే అధికారులకు ఫోన్ చేసినావాళ్లెప్పుడూ ఆ ఫోన్లకు సమాధానం ఇవ్వలేదని అన్నారు.అయితే కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు మాత్రం ఆయన్ను కలిసేవారని తెలిపారు. ఆ నేతలకు చెందిన నియోజకవర్గాలకు మాత్రమే నిధుల్ని రిలీజ్ చేసేవారని ఆరోపించారు. వీటన్నింటితో విసిగిపోయామని, అందుకే షిండేను ఆశ్రయించామని తెలిపారు. హిందుత్వ, రామ మందిరం పార్టీకి కీలకమైన అంశాలని, మరి అలాంటప్పుడు అయోధ్య వెళ్లకుండా తమ ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఆదిత్య థాకరే అయోధ్య వెళ్తున్న సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు వెళ్లనివ్వలేదని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jun,2022 02:26PM