హైదరాబాద్: దివంగత పి.జనార్దన్ రెడ్డి కుమార్తె. కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయారెడ్డికమాట్లాడుతూ ఖైరతబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. తాను పార్టీ మారడం ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు తనను బాధించాయన్నారు. షీ టీమ్‌లు పెట్టామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్నా... మహిళలపై లైంగికదాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల బాగోగులను కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుందని చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేయడానికి వచ్చానన్నారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదని, ఇక మూడు రంగుల జెండా వదలనని, స్పష్టం చేశారు.
విజయారెడ్డికి కోమటిరెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. విజయారెడ్డి తమకు సోదరి అని అన్నారు. ఖైరతాబాదే కాకుండా ఎక్కడ నిలుచున్నా విజయారెడ్డి ఎమ్మెల్యే అవుతారని చెప్పారు. విజయారెడ్డిని ఎమ్మెల్యేను చేసినప్పుడే పీజేఆర్‌కు అసలైన నివాళి అని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jun,2022 03:26PM