బెంగళూర్ : బైక్‌లో మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ద్విచక్ర వాహనంపై శివరాముడు అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో దసరగుల్పె గ్రామం వద్దకు రాగానే వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వారికి అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించగా ఫలితం రాలేదు. మంటల ధాటికి శివరాముడు మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్ ట్యాంకు లీక్ కావడంతోనే ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm