హైదరాబాద్: గొర్రెల స్కీం పేరుతో రూ.8 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారన్న ఆరోపణపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల పశువైద్య ఉపకేంద్ర జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సజ్జా శ్రీనివాసరావు ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు పశుసంవర్థక శాఖ డైరెక్టర్ ఎస్.రామచందర్ శనివారం సస్పెన్షన్ ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ కేసులో శీనివాసరావును ఈ నెల 9న ఘటకేసర్ పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో ఆయన భార్య లక్ష్మితో పాటు బావ అనిల్‌కుమార్, మరో వ్యక్తి అరవింద్ కుమార్‌నూ పోలీసులు అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm