వరంగల్: పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆదివారం ఉదయం సైక్లోథాన్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, సీపీ తరుణ్ జోషీ, వరంగల్ కలెక్టర్ గోపీ, ఇతర పోలీసు అధికారులు హాజరయ్యారు. సైక్లోథాన్ పోటీల్లో భాగంగా సీపీ తరుణ్ జోషీ, వరంగల్ కలెక్టర్ గోపీ, అడిషనల్ డీసీపీ వెంకటలక్ష్మి స్టెప్పులేశారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీసు కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో ఇవాళ సైక్లోథాన్- 2022 సైక్లింగ్ పోటీలు జరుగుతున్నాయి. వరంగల్ సీపీ తరుణ్‌జోషి ప్రత్యేక ఆసక్తితో ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకరమైన సమాజం కోసం వరంగల్ వేదికగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm