హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్ రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అమ్మ ఒడి నిధులను శ్రీకాకుళంలో జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరతారు. ఉదయం 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటలకు శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. జగనన్న అమ్మ ఒడి పథకం లబ్దిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఒక్క కంప్యూటర్ బటన్ క్లిక్ తో అమ్మ ఒడి లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. అనంతరం సీఎం ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం నుంచి తిరుగు పయనమవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.
Mon Jan 19, 2015 06:51 pm