హైదరాబాద్ : ఏపీలోని అనంతపురం పుట్లూరు మండలంలో శనగలగూడూరు గ్రామంలో కుటుంబ కలహాలతో రామాంజనమ్మ(55) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. రామాంజనమ్మ భర్త నడిపి రంగారెడ్డి ఇంటిలో సమస్యలపై వాగ్వాదం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఇంటిలో ఎవరూలేని సమయంలో విషపుగుళికలు మింగి ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం తాడిపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. రామాంజనమ్మకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా, ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదూ రాలేదని ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm