హైదరాబాద్ : 'ఉప్పెన' వంటి ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ తేజ్, తొలి సినిమాతోనే యూత్ హృదయాలను దోచేసుకున్నాడు. 'రంగ రంగ వైభవంగా' అనే సినిమాతో మరో ప్రేమకథతో పలకరించడానికి ఆయన మళ్లీ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా కేతిక శర్మ అలరించనుంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, గిరీశాయ దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mon Jan 19, 2015 06:51 pm