హైదరాబాద్ : ఎంతో కాలంగా ప్రేమ, సహజీవనం లో ఉన్న రణబీర్ కపూర్, అలియాభట్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకోవడం తెలిసిందే. పెళ్లయిన రెండు నెలలకే అలియాభట్ కడుపు పండిన వార్త బయటకు వచ్చింది. సోనో గ్రఫీ పరీక్ష చేయించుకుంటున్న ఫొటోను అలియానే స్వయంగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆమె పక్కనే ఉన్న రణబీర్ కపూర్ స్క్రీన్ వైపు చూస్తుండడం ఫొటోలో కనిపిస్తోంది.
దీంతో రణబీర్, అలియా తల్లిదండ్రులు కాబోతున్నట్టు ధ్రువీకరణ అయింది. ఈ ఏడాది నవంబర్ లో అలియా బిడ్డను ప్రసవించనున్నట్టు తెలుస్తోంది. 'మా బేబీ త్వరలోనే వస్తోంది' అంటూ అలియాభట్ ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించి అభిమానుల మనసు తీపి చేసింది. వైద్యులను ఎప్పటికప్పుడు అలియాభట్ పరీక్షలు చేయించుకుంటున్నారని, ఇప్పటి వరకు అంతా బాగానే ఉందని ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం రణబీర్ కపూర్, ఆలియాభట్ కలిసిన నటించిన చిత్రం బ్రహాస్త పార్ట్ 1 విడుదలకు సిద్దంగా ఉంది. ఆలియాభట్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే చిత్రంలో ఆలియాభట్ ను హీరోయిన్ గా కనఫర్మ్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. తల్లి కాబోతున్న ఆలియాభట్ ఎన్టీఆర్ చిత్రంలో నటించడం కష్టామే అనిపిస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jun,2022 12:04PM