హైదరాబాద్ : పోలీసుల వాహనం బోల్తా పడటంతో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు సమీపంలోని ఎయిమ్స్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుంచి పోలీసు వాహనం వరంగల్‌కు వెళ్తుంది. కాగా, బీబీనగర్ వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో 8 మంది ఉన్నారు. విషయం తెలిసిన బీబీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm