హైదరాబాద్ : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు ఆర్చ్ వద్ద రోడ్డు పక్కన సమీపంలో ఒక్కసారిగా దాదాపుగా 11 ఏనుగులు ప్రత్యక్షమై కొద్దిసేపటి వరకు అక్కడే ఉండిపోయాయి. దీంతో మొదటి ఘాట్ రోడ్డుమీదుగా వాహనదారులు ఏనుగులను చూసి ఆందోళనకు గురయ్యారు. భక్తులు అందించిన సమాచారం మేరకు అటవి అధికారులు హుటాహుటిన అక్కడకి చేరుకున్నారు. ఏనుగుల గుంపును తిరిగి అరణ్యంలోనికి పంపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.గత కొన్ని రోజులుగా ఏనుగుల మంద పాపవినాశనం రోడ్డులో సంచరిస్తున్నాయి. పార్వేట మండపం వద్ద వాహనదారులనె వెంబడించడంతో భక్తులు ఆందోళనకు లోనయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm