హైదరాబాద్ : ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న ఆవుల సుబ్బారావు.. అల్లర్లలో తన పాత్ర లేదని అంటున్నాడు. ఈ మేరకు బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో అతను పిటిషన్ దాఖలు చేశారు. యువతను సైన్యంలో చేరేలా తాను పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు సుబ్బారావు పిటిషన్లో తెలిపారు. పోలీసులే అక్రమంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. మరోవైపు పోలీసుల తరఫు న్యాయవాది... ఆవుల సుబ్బారావు పాత్రపై తమ వద్ద ఉన్న ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm