హైదరాబాద్ : ప్రముఖ రేబాన్ బ్రాండ్ ఓనర్ లియోనార్డో డెల్ (87) వెచ్చియో కన్నుమూశారు. కంటి అద్దాల మార్కెట్‌లో రేబాన్ అద్దాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఎస్సిల్లార్ లక్సోటికా పేరుతో 25 ఏండ్ల వయసులో ఆయన కంపెనీ ప్రారంభించారు. ఆ కంపెనీ నుంచి వచ్చిన రేబాన్ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమసైంది. ప్రపంచ వ్యాప్తంగా మేటి బిజినెస్‌మాన్‌గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన లక్సోటికా కంపెనీ చైర్మెన్‌గా ఉన్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జూన్ 1 నాటికి ఆయన నికర ఆస్తుల విలువ 25.7 బిలియన్ల డాలర్లు.
Mon Jan 19, 2015 06:51 pm