హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ ను టీ20 కెప్టెన్ గా తప్పించి టెస్టు, వన్డేలకు మాత్రమే సారథిగా ఉంచాలని అన్నాడు. తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. టీ20 ఫార్మాట్ లో భారత జట్టు పగ్గాలను అప్పగించేందుకు బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో మరొకరు ఉంటే మాత్రం టీ20 సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ ను వెంటనే తప్పించాలన్నారు. దీంతో రోహిత్ తన పనిభారాన్ని తగ్గించుకుని, ఫిట్ నెస్ ను కాపాడుకునే అవకాశముంటుందని చెప్పారు.తద్వారా టెస్టులు, వన్డేలలో బాగా ఆడటానికి ఆస్కారముంటుందన్నారు. రోహిత్ వయసు దృష్ట్యా కూడా బీసీసీఐ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm