చెన్నై : నేటికాలంలో యువకులకు పెండ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకాలంటే కష్టంగా ఉంది. మ్యారేజ్ బ్యూరోలను, బంధువుల్ని సంప్రదిస్తున్నా పెద్దగా ప్రయోజనమేమీ ఉండడం లేదు. అయితే తమిళనాడుకు చెందిన ఓ యువకుడు కూడా వివాహం చేసుకోవాలని ఐదేండ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఫలితం లేకపోవడంతో ఒక వినూత్న ఆలోచన చేశాడు. అదేంటంటే.. తనకి భార్య కావాలంటూ.. పోస్టర్లు వేసి అక్కడక్కడా అతికించాడు. ఇది చూసిన జనాలు షాక్ అవుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మధురైలో ఉంటున్న 27 ఏండ్ల జగన్.. ఓ ప్రయివేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడట. నెలకు రూ. 40 వేల జీతం. ఇక పెండ్లి చేసుకోవాలనుకున్న జగన్.. తనకు కాబోయే జీవిత భాగస్వామి కోసం వెతకడం మొదలుపెట్టాడట. ఐదేండ్లుగా తానెంత వెతికినా.. ఎవర్ని సంప్రదించినా అమ్మాయి మాత్రం దొరకలేదు. దాంతో అతనికి ఓ ఐడియా వచ్చింది. తాను డిజైనర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో.. తన పేరు, కులం, వృత్తి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ వివరాలు, తన ఫొటో కూడా వచ్చేలా ఓ పోస్టర్‌ని తయారుచేసి తాను నివసించే ప్రాంతంలోనే కాకుండా.. మరికొన్ని ప్రాంతాల్లోనూ వాటిని అంటించాడు. ఇప్పుడా పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి జగన్ చేసిన ఈ ప్రయత్నం ఫలిస్తుందా లేదా చూడాలి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jun,2022 07:33PM