మూడు లక్షల ఒప్పందం
వివరాలు వెల్లడించిన డీ సీ పీ అరవింద్ బాబు
నవతెలంగాణ కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లక్కంపల్లి ఉప సర్పంచ్ ను హత్య చేసేందుకు, మాజీ సర్పంచ్ పై దాడికి వ్యూహరచన చేసిన సుపారీ గ్యాంగ్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీ సీ పీ అరవింద్ బాబు వెల్లడించారు. లక్కంపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ మాయ పురం శ్రీనివాస్ ,మాజీ సర్పంచ్ ప్రసాద్ రావులను హత్య చేసేందుకు లక్కంపల్లి సర్పంచ్ భర్త మహేందర్ సుపారీ ఇచ్చి వ్యూహరచన చేశాడని తెలిపారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన లెక్కల విషయంలో విభేదాలు తలెత్తడంతో వారిద్దరిని హతమార్చేందుకు కుట్ర చేశాడన్నారు. హత్య చేసేందుకు రూ. మూడు లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. 15 రోజుల క్రితం నంది పేట గ్రామానికి చెందిన ఎండి అక్బర్ తో మహేందర్ చర్చించాడన్నారు. అయితే హత్య చేసేందుకు ఐదు లక్షల రూపాయలు కావాలని అక్బర్ డిమాండ్ చేయడంతో చివరకు ఉప సర్పంచ్ శ్రీనివాసును హత్య చేయాలని మాజీ సర్పంచ్ ప్రసాదరావును కాళ్లు చేతులు విరగ కొట్టాలని మూడు లక్షల రూపాయలకు మహేందర్ ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. దీంతో ఎండి అక్బర్ మరో వ్యక్తి ఉస్మాన్ తో మాట్లాడుకొని వారి వద్ద 20 వేల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్నాడన్నారు నిజామాబాద్ నగరంలోని అజాం రోడ్ లో 400 రూపాయలకు రెండు కత్తులను విక్రయించినట్లు డీ సీ పీ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నందిపేట్ పోలీసులు సోమవారం నందిపేట్ లో నిందితులను పట్టుకుని అరెస్టు చేసి వారి వద్ద నుంచి హత్య చేసేందుకు విక్రయించిన రెండు కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోడ మహేందర్,ఎండి అక్బర్,షేక్ ఉస్మాన్లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఆర్మూర్ ఏసిపి ప్రభాకర్ రావు ఆర్మూర్ రూరల్ సిఐ, ఎస్సై పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jun,2022 07:51PM