హైదరాబాద్: ఇంటర్ ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫలితాలను https://tsbienew.cgg.gov.in/ , https://results. cgg.gov.in , https://examresults.ts.nic.in వెబ్ సైట్లలో చూసుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 4,42,767 మంది సెకండియర్ విద్యార్థులు, 4,64,626 మంది ఫస్టియర్ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరిలో వొకేషనల్ విద్యార్థులు కూడా ఉన్నారు. మే 6 నుంచి 24 వరకు పరీక్షలు జరిగాయి. విద్యార్థులు ఒత్తిడికి గురైనా, ఇతర సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నం.18005999333ను సంప్రదించవచ్చని మంత్రి సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm