అమరావతి : ఏపీలోని కడప జిల్లాలో ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై ఓ వర్గం వారు దాడికి యత్నించారు. వివరాల్లోకెళ్తే.. పట్టణంలోని ఓ ప్రార్థన మందిరం జెండా చెట్టును సోమవారం మున్సిపల్ అధికారులు తొలగించారు. దాంతో ఓ వర్గం వారు ఆందోళనకు దిగారు.వారితో చర్చించేందుకు ఎమ్మెల్యే రాచమల్లు తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఎమ్మెల్యే చెప్పిన వివరాలను వారు విన్నారు. అయితే ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లేందుకు సిద్ధమైన వెంటనే ఆయన కారుపై దాడికి యత్నించారు. అయితే అప్రమత్తమైన ఎమ్మెల్యే అనుచరులు వారిని అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పింది.
అనంతరం కారు దిగిన రాచమల్లు మున్సిపల్ అధికారులను అక్కడికి పిలిపించారు. జెండా చెట్టును కూల్చి వేసిన చోటనే జెండా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.బుధవారం జెండా చుట్టూ గోడ నిర్మాణానికి చర్యలు చేపడతామని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jun,2022 09:10PM