జైపూర్ : రాజస్థాన్ లో దారుణం వెలుగు చూసింది. 13 ఏండ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. దాంతో ఆమె గర్భం దాల్చింది. ఈ మేరకుఇద్దరు టీనేజర్లతో సహా ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఓ రోజు అతను బాలికకు ఫోన్ చేసి కలుద్దామని చెప్పాడు. దాంతో బాలిక వెళ్లగా ఆమెపై అతను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక కడుపు నొప్పితో బాధ పడడం వల్ల ఆమె తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలిక గర్భవతి అని తేలింది. ఈ మేరకు ఆదివారం అర్ధరాత్రి బాలిక తల్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jun,2022 09:25PM