హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు కోసం 68.10 లక్షల మంది అర్హులుగా తేలినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమకానున్న సంగతి తెలిసిందే. ఈ దఫా కోటి 50 లక్షల 43 వేల 606 ఎకరాలకు రైతుబంధు సాయం అందనున్నదని మంత్రి చెప్పారు. పంపిణీకి రూ.7521.80 కోట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రోజుకు ఒక ఎకరా నుంచి ఆరోహణా క్రమంలో రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్టు చెప్పారు. సీసీఎల్ఎ వ్యవసాయ శాఖకు వివరాలు అందించినట్టు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎకరాల వారీగా బిల్లుల జాబితా రూపొందించి ఆర్థికశాఖకు అందించారన్నారు.
మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి పట్టాదార్ పాసుబుక్కు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు అందించి నమోదు చేసుకోవాలని సూచించారు.
రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పత్తి, కంది ఇతర అపరాలు, నూనెగింజల పంటల సాగుపై దృష్టిసారించాలని మంత్రి సూచించారు.జులై 15వ తేదీ వరకు పత్తి విత్తుకునే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వర్షాలు కొంత ఆలస్యమయినందున తేలిక నేలలలో 5 నుండి 6.5 సెంటిమీటర్లు, బరువు నేలలలో 6 నుండి 7.5 సెంటిమీటర్ల వర్షాపాతం నమోదు అయిన తర్వాతనే రైతులు వర్షాధార పంటలను విత్తుకోవాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 27 Jun,2022 09:41PM