హైదరాబాద్ : కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందుగా దరఖాస్తుకు చివరి తేదీగా జూన్ 27(నేడు) అని నిర్ణయించారు. తాజాగా ఆ గడువును జులై 4 వరకు పొడగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆధికారులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm