అమరావతి : ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడ మండలం బొమ్ములూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బొమ్ములూరు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేశారు. దాంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొమ్మలూరు చేరుకున్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావులు టీడీపీ కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైసీపీ రంగులను చెరిపేసి ఎన్టీఆర్ విగ్రహానికి పసుపు రంగులు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని కి వ్యతిరేకంగా టిడిపి నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే అనంతరం టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దాడి చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm