తిరుపతి: బండరాయితో తలపై మోది చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తిరుపతి రూరల్ చెర్లోపల్లె వద్ద సోమవారం వేకువజామున ఈ దుర్ఘటన జరిగింది. ఎంఆర్‌పల్లె ఎస్ఐ వినోద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చెర్లోపల్లె మద్యం దుకాణం వద్ద ఓ మృతదేహం ఉందన్న సమాచారం పోలీసులకు అందింది. ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బండరాయితో తలపై బలంగా కొట్టడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు. వ్యక్తిగత వివరాలేమీ లభ్యం కాలేదు. చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగించే వ్యక్తిగా తేలింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. త్వరలోనే హంతకులను పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm