హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మంగళవారం రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ప్రమాణస్వీకారం కార్యక్రమం అనంతరం గవర్నర్ తేనేటి విందు ఇవ్వగా అందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళిసైతో కేసీఆర్ ముచ్చటించారు. అలాగే అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. చాలా రోజులుగా గవర్నర్ కు, సీఎంకు దూరం పెరిగిందన్న ప్రచారం నేపథ్యంలో వీరు కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 9 నెలల తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్ కు రావడంతో గవర్నర్ కు, సీఎంకు మధ్య దూరం కాస్త తగ్గినట్టుగా తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Jun,2022 01:09PM