హైదరాబాద్: పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చాయని ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. చింతలబస్తికి చెందిన గౌతం కుమార్ (18) ఇటీవలె ఇంటర్ పరీక్షలు రాశాడు. నేడు ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తక్కువ మార్కులతో అతను పాసవ్వడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని స్థానిక మహావీర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm