హైదరాబాద్ : తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్) హెలిక్టాపర్ ఒకటి ప్రమాదం నుంచి తప్పించుకుంది. ముంబయికి పశ్చిమంగా 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ హెలికాప్టర్ ముందుకు కొనసాగలేని పరిస్థితుల్లో అరేబియా సముద్రంలోని సాగర్ కిరణ్ ఆఫ్ షోర్ రిగ్ వద్ద అత్యవసరంగా కిందికి దిగింది. ఆ సమయంలో ఇద్దరు పైలెట్లు, ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరిని కాపాడేందుకు ఓ కోస్ట్ గార్డ్ విమానం రంగంలోకి దిగింది. సరకు రవాణా నౌక మాలవ్య-16ను కూడా సహాయక చర్యల కోసం మళ్లించారు. లైఫ్ బోట్ల సాయంతో హెలికాప్టర్ లోని వారిని వెలుపలికి తరలించారు. కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ముంబయిలోని ఓఎన్జీసీ ఆసుపత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm