చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయనున్నట్టు ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. మంగళవారం అసెంబ్లీ జీరో అవర్‌లో విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా లేవనెత్తిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా త్వరలోనే అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని అసెంబ్లీ ముందుకు తీసుకువస్తామని తెలిపారు. అగ్నిపథ్ పథకం భారత సైన్యం మౌలిక నిర్మాణాన్ని ధ్వంసం చేస్తుందని, ఎన్డీయే ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా, హేతుబద్ధం కాని నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఇందువల్ల దేశ యువత భవిష్యత్తు నాశనమవు తుందని అన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ, సాగు చట్టాలు వంటి పథకాల ప్రయోజనం ఏమిటో ఒక్క బీజేపీ నేతలకు మినహా ఎవ్వరికీ, ఎన్నటికీ అర్థంకావని అన్నారు. అలాంటి అనాలోచిత చర్యల్లో ఇప్పుడు అగ్నిపథ్ కూడా వచ్చి చేరిందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm