హైదరాబాద్ : గతంలో తామిచ్చిన ఆదేశాలన్నింటినీ జులై 4లోగా పాటించాలని ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం తుది నోటీసులు జారీ చేసింది. గడువులోగా నిబంధనలను పాటించకపోతే ట్విట్టర్ లో పోస్ట్ అయిన అన్ని కామెంట్లకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అంతర్జాతీయ న్యాయవాద గ్రూప్ ఫ్రీడమ్ హౌస్, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రైతుల నిరసనకు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లను, కొన్ని ట్వీట్లను తొలగించాలని ట్విట్టర్ ను కేంద్ర ప్రభుత్వం గతంలో కోరింది. దాంతో తాము బ్లాక్ చేసిన 80కి పైగా ట్విట్టర్ అకౌంట్లు, ట్వీట్ల జాబితాను జూన్ 26న కేంద్రానికి ట్విట్టర్ అందించింది. అయినప్పటికీ తాము చేసిన ఆదేశాల్లో ఇంకా పాటించాల్సినవి చాలా ఉన్నాయని కేంద్రం తెలిపింది. వాటన్నింటినీ జులై 4లోగా పాటించాలంటూ తాజాగా చివరి నోటీసును జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Jun,2022 05:04PM