ముంబై : శివసేన రెబల్ ఎమ్మెల్యేల ముంబై ప్రయాణం చివరి నిమిషంలో వాయిదా పడింది. ప్రయాణాన్ని రద్దు చేసుకుని వారంతా తిరిగి అస్సాం హోటల్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నేడు ముంబయికి చేరుకోనున్నట్లు షిండే ప్రకటించారు. అయితే గురువారం జరగనున్న అవిశ్వాసానికి పరీక్షకు వ్యతిరేకంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు అనర్హత వేటుపై ఇంకా స్పందించనందున గవర్నర్ అభ్యర్థన చట్టవిరుద్ధమని థాకరే బృందం పేర్కొంది.
ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేల పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ముంబైకి చేరుకోనున్నట్లు షిండే వెల్లడించారు. తమతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, మూడింట రెండొంతుల మెజారిటీ ఉందని పేర్కొన్నారు. బలపరీక్షకు భయపడమని, ఎవరూ ఆపలేరని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 29 Jun,2022 06:12PM