హైదరాబాద్ : వివాహ వేడుకల్లో భాగంగా వరుడు కాళ్లకు వధువు నమస్కరించడం మనం చూస్తుంటాం. అయితే వధువు కాళ్లను నమస్కరిస్తున్న ఓ వరుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో వధువుకు నమస్కరించగా వధువు ఒకింత ఆశ్చర్యానికి గురైంది. అనంతరం ఆమెను వరుడు కౌగిలించుకున్నాడు. యువతి పేరు దితి గోరాదియాగా తెలుస్తోంది. తనే తన వివాహం నాటి ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. ఆమె భర్త పేరు ఆర్నవ్ అని తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm