ముంబై : రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ 2 నగరాల పేర్లతో పాటు ఓ ఎయిర్ పోర్టు పేరును మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చింది. అలాగే ముంబైలోని నవీ ముంబై ఎయిర్ పోర్టు పేరును డీబీ పాటిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మార్చింది. ఈ మూడు ప్రతిపాదనలకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm