హైదరాబాద్: తెలంగాణలో రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ఏఈఓ వంద మంది రైతులను ఎంపిక చేసుకుని ఉద్యాన పంటల వైపు మళ్లించాలని అన్నారు. బుధవారం డీఏఓలు, ఏడీఏలు, డీహెచ్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా రైతులు, పంటల వివరాల నమోదు కోసం రూపొందించిన ఏఈఓ యాప్ ను మంత్రి విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్టోబరు నుంచి మే వరకు వేయగలిగే పంటలపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు సంయుక్తంగా రైతులను సన్నద్దం చేయాలన్నారు. అన్ని రైతువేదికలలో తప్పనిసరిగా బంతిపూల చెట్లను నాటాలన్నారు. తెగుళ్లు సోకి పంటలు నష్టపోయాక కాకుండా ముందే రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm